🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరులో రోడ్ల అభివృద్ధికి రూ.180 కోట్ల నిధులు
ప్రజా సమస్యలకు దశలవారీగా పరిష్కారం
ఏలూరులో సీసీ రోడ్లకు మహర్దశ
➖బడేటి చంటి
గతంలో పాదయాత్ర సందర్భంగా గుర్తించిన ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పనిచేస్తున్నామని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో 26వ డివిజన్లో రూ.30.30 లక్షలు, 27వ డివిజన్లో రూ.45 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని, ఏలూరుకు అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ద్వారా సుమారు రూ.180 కోట్ల నిధులు రానున్నాయని బడేటి చంటి తెలిపారు. వాటితో రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

