🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

95 శాతం పనులకు అనుమతులు
రూ.2.88 కోట్ల కొత్త ప్రతిపాదనలు
“దూకుడు” అంటే హీరో మహేష్ బాబు కాదు… “ఎంపీ మహేష్”
హీరో మహేష్ దూకుడు – సినిమాల్లో..!!
ఎంపీ మహేష్ దూకుడు – అభివృద్ధిలో..!!
ఎంపీ ల్యాడ్స్ నిధులను అభివృద్ధి పనులకు సద్వినియోగం చేయడంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. గత రెండేళ్లలో పార్లమెంటు పరిధిలో సుమారు రూ.9.38 కోట్ల విలువైన 102 పనులకు ప్రతిపాదనలు పంపగా, 96 పనులకు దాదాపు రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో 65 పనులు పూర్తికాగా, మరో 31 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
2024-25లో రూ.4.45 కోట్లు, 2025-26లో రూ.4.93 కోట్ల విలువైన పనులకు అనుమతులు లభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబొరేటరీలు, ఆసుపత్రుల్లో పరికరాలు, అంబులెన్స్‌లు, క్రీడా సదుపాయాలు, వీధిలైట్లు, రహదారులు, సామాజిక సంక్షేమ భవనాలు తదితర పనులకు నిధులు కేటాయించారు. ఏలూరు పట్టణంలో రూ.64 లక్షలతో పోలీస్ బ్యారక్స్ నిర్మాణం పూర్తయింది.
వివిధ సామాజిక వర్గాల సంక్షేమ భవనాల కోసం తొమ్మిది పనులకు రూ.2.86 కోట్ల మేర నిధులు కేటాయించారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 54 శ్మశానవాటికల అభివృద్ధి పనులు చేపట్టారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.2.88 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చే వినతులకు అనుగుణంగా పనులు మంజూరు చేస్తూ, వాటి పురోగతిని ఎంపీ కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. నిధుల దుర్వినియోగానికి తావులేకుండా పూర్తయిన పనుల మేరకే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

