🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
రక్తదానం – ప్రాణదానంతో సమానం
రక్తదాతలకు ఎమ్మెల్యే సౌమ్య అభినందనలు
ప్రేమ, దయ, సేవా భావాలతో ముందుకు సాగాలి
మానవతా విలువలకు రక్తదాన శిబిరాలు ప్రతీకలు
ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని నందిగామలోని ప్రతిభ హైస్కూల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులతో కలిసి శిబిరాన్ని పరిశీలించి రక్తదాతలను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే రక్తదానం గొప్ప మానవతా సేవ అని, సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని, ప్రవక్త బోధించిన ప్రేమ, దయ, సేవా భావాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు సోదరభావంతో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, రక్తదాతలు పాల్గొన్నారు.

