The Desk… Bhimavaram : నిత్యాన్నదానానికి రూ.51 వేల విరాళం

The Desk… Bhimavaram : నిత్యాన్నదానానికి రూ.51 వేల విరాళం

🔴 పగో : భీమవరం : ది డెస్క్ :

ఆధ్యాత్మిక సేవలో “జంపన దంపతుల” భాగస్వామ్యం

అన్నదానానికి “దంపతుల” చేయూత

మావుళ్లమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకు భీమవరానికి చెందిన జంపన సత్యనారాయణ రాజు, పద్మావతి దంపతులు రూ.51 వేల విరాళాన్ని అందజేశారు. భక్తులకు నిరంతరం అన్నదానం అందించాలనే ఉద్దేశంతో ఆలయం నిర్వహిస్తున్న శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారంగా ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపారు.

విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేయగా…ఆలయ అర్చకులు దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు రామాయణం శ్రీనివాస్ దంపతులకు శేషవస్త్రం, ప్రసాదం అందజేసి అభినందించారు.

సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ “బుద్ధ మహాలక్ష్మి నగేష్” మాట్లాడుతూ..

అమ్మవారి నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా భక్తులకు సేవ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. అన్నదానానికి విరాళం అందించిన జంపన సత్యనారాయణ రాజు, పద్మావతి దంపతులకు ఆలయ సిబ్బంది, అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు.