🟡 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ :
కేంద్ర మంత్రి సమాధానం.. ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ ప్రశ్నకు స్పందన
నూజివీడు కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణ బాధ్యతలను నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCC)కు అప్పగించినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. సోమవారం లోక్‌సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
2026–27 విద్యా సంవత్సరం నుంచే నూజివీడు కేంద్రీయ విద్యాలయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం 250 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి వెల్లడించారు. తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న విద్యాలయానికి శాశ్వత భవనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరిలో ఏడు ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఈ స్థలంలో NPCC ఆధ్వర్యంలో శాశ్వత భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ కేంద్ర మంత్రిని కోరారు.

