🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
సంక్షేమానికి రూ.1.49 లక్షల కోట్లు
ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రానికి పునర్వైభవం
కూటమి పాలనపై ప్రజల్లో ఆదరణ
వైసీపీ విమర్శలకు ప్రజలే సమాధానం
➖ ఎమ్మెల్యే చంటి
వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక, పరిపాలనా అగాధం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
రెండేళ్ల కూటమి పాలనలో సంక్షేమానికి రూ.1.49 లక్షల కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన రుణాల రీ-షెడ్యూల్ ద్వారా రూ.8,269 కోట్లు ఆదా చేశామని, ఉద్యోగుల బకాయిలకు రూ.30,849 కోట్లు, పెండింగ్ బిల్లులకు రూ.19,357 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు, పరామర్శల పేరుతో రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు.
ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం, అభివృద్ధికే వినియోగిస్తూ బాధ్యతాయుత పాలన అందిస్తున్నామని చంటి అన్నారు. విధ్వంసక చర్యలను ఉపేక్షించబోమన్న సీఎం చంద్రబాబు హెచ్చరికను గుర్తుచేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

