🟡 ఎన్టీఆర్ జిల్లా | నందిగామ | ది డెస్క్

పెద్దవరంలో ప్రజలను కలిసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ప్రజా సంక్షేమం – అభివృద్ధికి ప్రాధాన్యత
ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తాను
➖ ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో నిర్వహించిన ‘మంచి ప్రభుత్వానికి రెండేళ్లు’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. కూటమి నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రభుత్వ విజయాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. అలాగే నందిగామ నియోజకవర్గంలో తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనతో పాటు రైతు సంక్షేమానికి చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.

