The Desk … Proddutur : ▪️పారిశుధ్యానికి కొత్త ప్లాన్▪️పారిశుధ్యంపై కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు

The Desk … Proddutur : ▪️పారిశుధ్యానికి కొత్త ప్లాన్▪️పారిశుధ్యంపై కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు

🔴 కడప జిల్లా : ప్రొద్దుటూరు : ది డెస్క్ :

ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర పట్టణమే లక్ష్యం

సైకిల్‌పై కమిషనర్

పరిశుభ్రతపై ఫోకస్

ప్రొద్దుటూరును పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దే కార్యాచరణ

వార్డుల వారీ మ్యాపింగ్‌తో పారిశుధ్యానికి పదును

ప్రొద్దుటూరులో పారిశుధ్య నిర్వహణను ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సోమవారం తెల్లవారుజామున పారిశుధ్య కార్మికుల మస్టర్‌రోల్‌ను స్వయంగా తనిఖీ చేసిన ఆయన, అనంతరం సైకిల్‌పై పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి రోడ్లు, డ్రైన్లు, చెత్త నిర్వహణను పరిశీలించారు.

చికెన్, మటన్, హోటళ్లు, టీ దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారులతో మాట్లాడిన కమిషనర్, వ్యాపార కేంద్రాల్లో డస్ట్‌బిన్లు లేకపోవడం, శ్రీరాములుపేటలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వంటి సమస్యలను గుర్తించారు. పారిశుధ్య కార్మికులను వార్డులు, సచివాలయాల వారీగా మ్యాపింగ్ చేసి పర్యవేక్షణను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

త్వరలో ఆస్పత్రులు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, మార్కెట్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహించి పారిశుధ్య నిర్వహణలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందిస్తామని కమిషనర్ తెలిపారు. అనంతరం అన్నా క్యాంటీన్‌ను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.