🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భక్తులకు ప్రసాదాల పంపిణీ
భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన కందకట్ల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, వైభవ్ శారీస్ అండ్ రేడిమెడ్స్ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 40 రకాల సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
సారెలో స్వీట్లు, వివిధ రకాల పండ్లు, పసుపు, కుంకుమ, చలివిడి, పానకం తదితర పూజా సామగ్రిని సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో వాటికి సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి నివేదించారు. అనంతరం సారెలోని పండ్లు, స్వీట్లు తదితర ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు. ఈ విషయాన్ని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
40 Varieties of Traditional Sare Offered to Goddess Mavullamma
Prasadam Distributed to Devotees
On Sunday, the family members of Kandakatla Nageswara Rao of Bhimavaram, under the auspices of Vaibhav Sarees & Readymades, offered a traditional Sare comprising around 40 varieties of ceremonial items to Goddess Mavullamma with great devotion and reverence.
The offering included sweets, a variety of fruits, turmeric, vermilion (kumkum), Chalividi (a traditional sweet preparation), Panakam (a traditional jaggery-based drink), and other sacred ritual materials.
Under the guidance of the temple’s Chief Priest, Maddirala Mallikarjuna Swamy, the offerings were ritually sanctified and presented to the Goddess. Subsequently, the fruits, sweets, and other prasadam from the ceremonial offering were distributed among the devotees.
The programme was attended by the temple trustee, Papolu Edukondalu.
According to Temple Assistant Commissioner Buddha Mahalakshmi Nagesh, the religious ceremony was conducted in a devotional atmosphere with the participation of devotees.

