🔴 ఏలూరు జిల్లా : పోలవరం మండలం : నూతన గూడెం : ది డెస్క్ :

బావిలోకి దిగి ఊపిరాడక మృతి
నూతన గూడెంకి చెందిన బండి మునేశ్వర రావు ఇంట్లో బావిలో పూడిక తీయడం కోసం గణేష్ నగర్ కు చెందిన రాజుతో పాటు పైడిపాక పునరావాస కాలనీకి చెందిన బండి వీర వెంకటరావు చిట్టిబాబు ఏలియాస్ రెడ్డి వచ్చారు.
ముందుగా చిట్టిబాబు బావిలో దిగి ఊపిరాడటం లేదని కేకలు వేయటంతో వీర వెంకటరావు అతనిని పైకి తీసుకువచ్చేందుకు బావిలో దిగాడు.
ఇద్దరు లోపల ఉండి కేకలు వేయటంతో స్థానికులు తాడు ఇచ్చి పైకి లాగేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.
విషయం తెలిసిన వెంటనే పోలవరం సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.

