The Desk … Tadepalligudem : స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర…డిప్యూటీ ఎంపీడీవో ఆధ్వర్యంలో

The Desk … Tadepalligudem : స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర…డిప్యూటీ ఎంపీడీవో ఆధ్వర్యంలో

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : నీలాద్రిపురం : ది డెస్క్ :

నీలాద్రిపురంలో ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా… “ప్లాస్టిక్ రహిత సమాజం మరియు ఆపరేషన్ క్లీన్ స్వీప్” అనే థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది అధికారులుతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మూలనలో, వాడకం తగ్గించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఆధ్వర్యంలో నీలాద్రిపురం పంచాయతీ పరిధిలో స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది