🔴 పగో జిల్లా : భీమవరం :ది డెస్క్ :
89 మంది దంపతుల పాల్గొనికతో ఆధ్యాత్మిక శోభ
భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా.. ఆదివారం చండీహోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పుణ్యకార్యక్రమంలో 89 మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ :
అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన చండీహోమం భక్తుల విశేష ఆదరణ పొందిందన్నారు. అమ్మవారి కృపతో భక్తులు కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కోసం హోమంలో పాల్గొన్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఉడీశి మీనాక్షి, గుసిడి నాగశిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, గొంతిన రమణ, యండ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

