🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ :

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి వితరణ
రూ.10,000/- వ్యయంతో బోరింగ్ పంపు ఏర్పాటు
ముదినేపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో వందలాదిమంది విద్యార్థులకు తాగు నీటి సౌకర్యం కల్పించేందుకు అమరావతి బాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి బోరింగ్ పంపును ఏర్పాటు చేయించారు. నీటిసాకర్యం లేదని తెలుసుకున్న వైష్ణవి వెంటనే స్పందించి తన తండ్రి డాక్టర్ మనోజ్ సహకారంతో.. రు. 10వేల వ్యయంతో బోరింగ్ పంపును ఏర్పాటు చేయించారు. దీంతో హైస్కూలు విద్యార్థులకు త్రాగు నీటి సౌకర్యం ఏర్పడింది. బోరింగ్ పంపును సోమవారం వైష్ణవి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ టి.ప్రసాద్, ఉపాధ్యాయిలు, స్థానికులు పాల్గొన్నారు.

