The Desk … Tadepalligudem : వరుస దొంగతనాల కేసులు ఛేదించిన తాడేపల్లిగూడెం పోలీసులు

The Desk … Tadepalligudem : వరుస దొంగతనాల కేసులు ఛేదించిన తాడేపల్లిగూడెం పోలీసులు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్:1

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

రూ.3.25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువుల స్వాధీనం

తాడేపల్లిగూడెం పట్టణంలో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్, గృహ దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం :

ఒంటరిగా వెళ్తున్న వృద్ధ మహిళల మెడలోని మంగళసూత్రాలను తెంచుకోవడం, తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడటం వంటి ఘటనల్లో పాల్గొన్న పులపాకుల తులసి (28), కామాక్షి దుర్గాప్రసాద్ (28)లను గురువారం ఉదయం తాడేపల్లిగూడెం శివాలయం బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి 20 గ్రాముల బంగారు మంగళసూత్రం, వివిధ కేసులకు సంబంధించిన 425 గ్రాములకు పైగా వెండి వస్తువులు, ఒక గ్రాము బంగారు చెవిపోగులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు..

డీఎస్పీ డి. విశ్వనాథ్ పర్యవేక్షణలో..

సీఐ ఆది ప్రసాద్ నేతృత్వంలో..

ఎస్సైలు బి. శ్రీనివాస్, కె.వి. రమణ మరియు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని అధికారులు సూచించారు.

Tadepalligudem Police Crack Series of Theft Cases

Two Interstate Thieves Arrested

Gold and Silver Ornaments Worth ₹3.25 Lakh Recovered

The Tadepalligudem police have successfully solved a series of recent chain-snatching and house burglary cases reported in the town and arrested two accused persons. Gold and silver ornaments worth approximately ₹3.25 lakh were recovered from their possession.

According to police officials :

The accused, identified as Pulapakula Tulasi (28) and Kamakshi Durgaprasad (28), were involved in snatching mangalsutra chains from elderly women walking alone and committing burglaries by breaking into locked houses. They were apprehended on Thursday morning near the Shiva Temple Bridge in Tadepalligudem.

Police recovered a 20-gram gold mangalsutra, more than 425 grams of silver articles connected to various theft cases, and one gram of gold earrings from the accused.
Acting on the instructions of

District SP Adnan Nayeem Asmi,

Under the supervision of DSP D. Viswanath,

And under the leadership of CI Adi Prasad,

SIs B. Srinivas and K.V.
Ramana, along with police personnel, conducted special surveillance operations and successfully apprehended the accused. They were subsequently produced before the court and remanded to judicial custody.

Police officials urged the public to remain vigilant regarding unfamiliar individuals and to immediately report any suspicious persons or activities to the police.

  1. ↩︎