🟡 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం
రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రతి బూత్‌లో ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రచారం చేయాలి
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ బలం
జూన్ 12 విజయోత్సవాలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి
ప్రతి వార్డులో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి
➖KNR
భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు పాల్గొని పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ :
జూన్ 12న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు మరియు కూటమి నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డు, ప్రతి బూత్ స్థాయిలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు చేరువయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు.
ఈ సమావేశంలో పట్టణ టీడీపీ నాయకులు, వార్డు ఇన్‌చార్జులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

