🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దారి : ది డెస్క్ :

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా…
కాల్దారి గ్రామంలో అధికారులు చేసే ప్రతి పనీ ప్రజలకు చేరువ అయ్యే విధంగా కాల్దారి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ప్రజలకు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పడం మాత్రమే కాదని.. పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ ను నిషేదించాలని, స్వచ్ఛత కోసం ప్రభుత్వం స్వచ్ఛరథం ద్వారా చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇంటింటికీ చేరువ అవుతున్న తరుణంలో… పంచాయితీ సిబ్బంది, కూరగాయల మొక్కలు, ఆకు కూరలు వేయాలన్నారు. రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమoలో పంచాయతీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, గ్రామ కూటమి నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, డ్వాక్రా మహిళలు,అంగన్వాడీ సిబ్బంది ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

