The Desk … Kalidindi : ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలకు ఎమ్మెల్యే డా. కామినేని సత్కారం

The Desk … Kalidindi : ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలకు ఎమ్మెల్యే డా. కామినేని సత్కారం

ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

మండలంలోని స్థానిక శ్రీ పాతాళభోగేశ్వరస్వామివారి పుణ్యక్షేత్ర అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలను కైకలూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ సత్కరించారు. శనివారం భోగేశ్వరం దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, దేవస్థానం చుట్టూ నిర్మిస్తున్న నూతన ప్రకార మండపం పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనులకు ఆర్థిక సహకారం అందించిన దాతలను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. దేవస్థానం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న ఎమ్మెల్యే.. మరింత మంది భక్తులు, దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ శ్రీ పార్వతి సమేత పాతాళ భోగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.