🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స తీసుకుంటున్న స్వాతికి వీడియో కాల్ ద్వారా ఎంపీ పరామర్శ.
కొద్ది రోజుల క్రితం ఏలూరు ఎంపీను ఆశ్రయించిన ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తురాలు.
ఆర్ధిక సాయం చేయటంతో పాటు, వైద్య సహాయం చేస్తానని మాటిచ్చిన ఎంపీ.
ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రిలో చేర్పించి ప్రత్యేక ఆహారం అందించే ఏర్పాటు.
మెరుగైన వైద్య సహాయం, ఎంపీ కార్యాలయం ద్వారా అందుతున్న పౌష్టిక ఆహారంతో, కోలుకుని కొద్దిగా మాట్లాడగలుగుతున్న యువతి.
చికిత్స పూర్తయ్యేవరకూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎంపీ.
తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నూజివీడు మండలం ‘పొలసానిపల్లి’ గ్రామానికి చెందిన తల్లీ తండ్రి లేని 25 సంవత్సరాల స్వాతి అనే యువతి కొద్ది రోజుల క్రితం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసి, తన ఆరోగ్య సమస్యను, వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులేని పరిస్థితిని వివరించగా, ఆమె పరిస్థితిని చూసి ఎంపీ చలించి, అప్పటికప్పుడు తక్షణ ఆర్థిక సహాయంగా 20 వేల రూపాయలు అందించడమే కాకుండా ఆమెకి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వార్తలు అన్ని మీడియాలలో వచ్చాయి. అయితే అక్కడితో వదిలి పెట్టేయకుండా, తర్వాతి రోజే ఆ యువతిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. హామీ ఇచ్చిన ప్రకారం ఆమె వైద్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందేట్లు చూస్తున్నారు. అంతేకాదు తన ఆఫీసు సిబ్బంది ద్వారా ఆమెకు ప్రతిరోజూ ప్రత్యేక పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. హామీ ఇచ్చినట్లుగానే మూడు చక్రాల వాహనాన్ని కూడా కేవలం మూడు రోజుల్లోనే అందించారు. అక్కడితో ఆగకుండా, ఆమె కోలుకునే వరకూ ప్రతి రోజూ వెళ్లి ఆమె యోగ క్షేమాలు తెలుసుకుని చెప్పాలని, ఆమెకు ఏ అవసరం, ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఆమె కోలుకునే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు.
తాజాగా గురువారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతితో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వ్యాధి పూర్తిగా తగ్గేవరకూ చికిత్స చేయించుకోవాలని చెప్పిన ఎంపీ, ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని, వైద్యం చివరి వరకూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గతంలో తీవ్ర ఆయాసంతో, మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడగా ప్రస్తుతం ఆయాసం, ఊపిరితిత్తులలో చేరిన నెమ్ము తీవ్రత కొంత తగ్గిందని చెప్పిన యువతి, ఎంపీ కి ఫోన్ లోనే కృతజ్ఞతలు తెలియచేసింది.

