The Desk …U.W.G Dist : 31- అనధికార లేఔట్లను తొలగించిన అధికారులు

The Desk …U.W.G Dist : 31- అనధికార లేఔట్లను తొలగించిన అధికారులు

🔴 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా : ది డెస్క్ :

60 మంది సిబ్బందితో…

15 స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి…

మునిసిపల్ శాఖా మంత్రి ఆదేశాలు మేరకు మరియు డైరెక్టర్ ఆప్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ( DT&CP), ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు మేరకు.. ఈరోజు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( EUDA) పరిధిలో, ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఏలూరు, జంగారెడ్డి గూడెం, కొయ్యలగూడెం,పెదపాడు, భీమడోలు, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు మరియు మొగల్తూరు మండలాలలో, ఎల్.ఆర్.ఎస్-2020 క్రింద క్రమబద్ధీకరణ పొందని 31 అనధికార లేఔట్లను, 60 మంది సిబ్బందితో, 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటుచేసి, వరప్రసాద్, అదనపు డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసు, వారి పర్యవేక్షణలో తొలగించారు.