The Desk … Tadepalligudem : ▪️SASA కార్యక్రమం ▪️గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ & పంచాయతీరాజ్ డిఈ ఆధ్వర్యంలో…

The Desk … Tadepalligudem : ▪️SASA కార్యక్రమం ▪️గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ & పంచాయతీరాజ్ డిఈ ఆధ్వర్యంలో…

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : పెద తాడేపల్లి : ది డెస్క్ :

పెదతాడేపల్లి గ్రామంలో SASA కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి మరియు పంచాయతీ రాజ్ డి.ఇ ఉప్పలపాటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, తాడేపల్లి SASA నోడల్ అధికారి అయిన వి.చంద్రశేఖరం పాల్గొని గ్రామస్తులకు తడిచెత్త – పొడిచెత్త పై అవగాహన కల్పించారు. గ్రామంలో ప్లాస్టిక్ ను నిషేధించి వాడకం పూర్తిగా అరికట్టాలని, గ్రామంలో షాపుల యజమానులకు సమావేశం నిర్వహించి, సూచనలు జారీచేసి, షాపు యజమానులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. అనంతరం SWM షెడ్డును పరిశీలించి ర్యాలీ నిర్వహించి ప్రజలచే స్వచ్చతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Under the aegis of the Gram Panchayat Special Officer and Panchayati Raj DE Uppalapati Srinivasarao, a SASA awareness programme was held in PedaTadepalli village, Tadepalligudem mandal, West Godavari.

Mandal Parishad Development Officer and SASA nodal officer V. Chandrashekhar led sessions on wet and dry waste segregation and urged a strict ban on plastic. Shopkeepers were convened and briefed on the plastic prohibition. Officials inspected the SWM shed, conducted a cleanliness rally and had residents pledge to maintain village sanitation. Secretariat staff also participated.