The Desk … Tadepalligudem : ▪️మట్టి గణపతులే మేలు▪️

The Desk … Tadepalligudem : ▪️మట్టి గణపతులే మేలు▪️

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ

పర్యావరణ హితమే.. మట్టి గణపతే

మట్టి గణపతిని పూజిద్దాం

కాలుష్యానికి చెక్

వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించేందుకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘం చర్యలు చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను స్పెషల్‌గ్రేడ్ కమిషనర్ ఎం. యేసుబాబు పంపిణీ చేశారు.

సందర్భంగా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచించారు. మట్టి విగ్రహాలతో జల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి. భవానీబాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి. సీతారం, మున్సిపల్ మేనేజర్ పి. ప్రసాద్, స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.