The Desk … Nandigama : ▪️ప్రజల గడపకే పాలన▪️సమస్యల పరిష్కారమే లక్ష్యం

The Desk … Nandigama : ▪️ప్రజల గడపకే పాలన▪️సమస్యల పరిష్కారమే లక్ష్యం

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారం చూపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మధిర ఆర్చి రోడ్డులోని ఆర్ఎస్‌ గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఆమె పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలేఖ్య, జిల్లా అధికారులతో కలిసి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే.. వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ప్రతి వినతిని నిబంధనల మేరకు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తామని సౌమ్య తెలిపారు.