The Desk…Tadepalligudem : ఎంఆర్‌ఎఫ్‌ కేంద్రంలో స్వచ్ఛతా కార్యక్రమం

The Desk…Tadepalligudem : ఎంఆర్‌ఎఫ్‌ కేంద్రంలో స్వచ్ఛతా కార్యక్రమం

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

స్వచ్ఛత హి సేవ–2026లో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 24వ వార్డు ఎంఆర్‌ఎఫ్‌ (మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ) కేంద్రంలో మంగళవారం శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్‌ ఎం. యేసుబాబు ఆధ్వర్యంలో కేంద్రం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించారు.

తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడంపై సిబ్బంది, స్థానికులకు అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద సృష్టించడంలో ఎంఆర్‌ఎఫ్‌ కేంద్రాలు కీలకమని, ప్రజలు ఇంటి నుంచే చెత్తను వేరు చేసి అందించాలని కమిషనర్‌ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, పారిశుధ్య, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.