The Desk… Nandigama : యువతకు ఉద్యోగాలే లక్ష్యం

The Desk… Nandigama : యువతకు ఉద్యోగాలే లక్ష్యం

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ న్యూస్ :

నందిగామలో APSSDC ఆధ్వర్యంలో జాబ్‌మేళా

నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ గాంధీ సెంటర్‌లోని ఎన్జీవో హోమ్‌లో APSSDC ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఆమె పాల్గొన్నారు. సుమారు 10 ప్రముఖ కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. విద్యార్హత, ఉద్యోగాన్ని బట్టి రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు వేతన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు.

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం :

తేజ డీవీఆర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ :

విద్యార్థి దశను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. మధిర ఆర్చి రోడ్డులోని తేజ డీవీఆర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో ఆమె పాల్గొని నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నందిగామలో మరో DTDC సెంటర్ :

ప్రజలకు మరింత చేరువగా కొరియర్ సేవలు :

పట్టణంలోని రైతుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన DTDC సర్వీస్ సెంటర్–2ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. నిర్వాహకులు చావా గణేష్, పోపూరి తేజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సెంటర్ ద్వారా కొరియర్, పార్సిల్, డాక్యుమెంట్ పంపిణీ సేవలు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.