🔴 ఏలూరు జిల్లా : పోలవరం : ది డెస్క్ :
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు.
పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ పర్యవేక్షణలో..
పోలవరం ఎస్సై పి. అప్పారావు…
కొయ్యలగూడెం ఎస్సై వి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో..
శుక్రవారం కార్మిల్పురం సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల మైదానంలో పోలవరం సర్కిల్ పోలీసులకు ప్రత్యేక పరేడ్, నేర పరిశోధనపై శిక్షణ నిర్వహించారు.
నేరస్థల పరిశీలనపై అవగాహన :
నేరస్థలాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించడం, ఫొటోలు తీయడం, భౌతిక సాక్ష్యాలను సేకరించి భద్రపరచడం, రఫ్స్కెచ్ రూపొందించడం, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కోర్టులో నిలిచేలా సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు.
క్రమశిక్షణతో విధులు :
పోలీసులు సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని డీఎస్పీ జయకృష్ణ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దర్యాప్తు నాణ్యతను పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు పి. అప్పారావు, వి. చంద్రశేఖర్, సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

