The Desk …Pedavegi : వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ

The Desk …Pedavegi : వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ

🔴 ఏలూరు జిల్లా : పెదవేగి మండలం పెదవేగి : ది డెస్క్ :

చెత్త నుంచి సేంద్రియ ఎరువు

స్వచ్ఛత నిర్వహణపై అవగాహన కార్యక్రమం

గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడంతో పాటు, సేంద్రియ వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీపై సిబ్బందికి అవగాహన కల్పించే లక్ష్యంతో పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో బుధవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కవ్వగుంట గ్రామ పంచాయతీలోని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ (SWPC) వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి. నాగేంద్ర కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ శిక్షణలో వర్మీ కంపోస్టు తయారీ, ఘన వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యర్థాలను ఉపయోగకరమైన ఎరువులుగా మార్చే విధానాలపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను పరిశీలిస్తూ, గ్రామాల్లో ఈ విధానాలను సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన అంశాలపై శిక్షణ ఇచ్చారు.

కార్యక్రమంలో ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎంఎస్‌జీఓ, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీఓలు), ప్రతి పంచాయతీ నుంచి క్లాప్ మిత్రాలు పాల్గొన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, తడి వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం, సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ శిక్షణ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.