🟡 కృష్ణాజిల్లా : పెదపారుపూడి మండలం : కోర్నిపాడు : ది డెస్క్ న్యూస్ :
అమరావతి అభివృద్ధికి ఆధ్యాత్మిక బలం
అమరావతి నిర్మాణానికి విరాళాల సేకరణలో భాగస్వాములవుదాo
కోర్నిపాడులో అర్చకులకు ఘన సన్మానం..పాదపూజ
రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తికావాలని ప్రత్యేక పూజలు
పెదపారుపూడి మండలం కోర్నిపాడులోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థాన అర్చకులు గొడవర్తి వెంకట రాఘవాచార్యులను అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ గురువారం ఘనంగా సన్మానించి, పాదపూజ నిర్వహించి వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి ఆలయ అర్చకులు తమవంతుగా ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొచ్చారని మనోజ్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా విరాళాలు సేకరించి రాజధాని అభివృద్ధిలో భాగస్వాములవుతామని అర్చకులు ప్రకటించారు. అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తై రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తూ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని రాఘవాచార్యులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

