🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
అధికారుల తక్షణ స్పందనతో అడ్డుకట్ట
బాలిక భవిష్యత్తుకు భరోసా
బాలిక &కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్
పట్టణంలో జరుగుతున్న బాల్య వివాహాన్ని జిల్లా బాలల సంరక్షణ విభాగం (DCPU) అధికారులు, మహిళా పోలీసులు సంయుక్తంగా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న DCPU అధికారి డాక్టర్ సూర్య చక్రవేణి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు తక్షణమే స్పందించి సంబంధిత ప్రాంతానికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం బాలికతో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల విద్య, ఆరోగ్యంపై పడే ప్రభావాలను వివరించారు.
చట్టబద్ధమైన వయస్సు వచ్చే వరకు వివాహం చేయడం నేరమని హెచ్చరించారు. బాలికల విద్య, భవిష్యత్తుకు తల్లిదండ్రులు ప్రాధాన్యమివ్వాలని, బాల్య వివాహాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

