🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

అభివృద్ధి–సంక్షేమంపై ప్రచారం
నందిగామలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నందిగామలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పెద్ద మసీదు సెంటర్, కుమ్మరి బజార్ ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి ‘అభివృద్ధి–సంక్షేమానికి రెండేళ్ల నమ్మకం.. కూటమి ప్రభుత్వం’ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊతమిచ్చి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తంగిరాల సౌమ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

