🟡 ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఏలూరు పార్లమెంట్ ఎన్నికల పరిశీలకురాలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పిలుపునిచ్చారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనురాధతో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), కైకలూరు నియోజకవర్గ పరిశీలకుడు, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కుటుంబసభ్యుల్లా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కూటమి తరఫున ఎవరు పోటీ చేసినా వారి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

