🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
బావిశెట్టి వారి పేటలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి
వినాయక చవితి సందర్భంగా ఏలూరు నగరంలోని 1వ డివిజన్ బావిశెట్టి వారి పేట చెరువుగట్టు వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినాయకుడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చంటి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
బావిశెట్టి వారి పేటలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పండుగ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

