🔴 పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్ :
రూ.60 వేల విలువైన 1/2 కాసు బంగారం విరాళం
ఆకుల వీరస్వామి–పద్మజారాణి దంపతుల సమర్పణ
భీమవరం పట్టణ ప్రజల ఆరాధ్యదైవం మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు భక్తుల నుంచి విరాళాల పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా భీమవరానికి చెందిన ఆకుల వీరస్వామి–పద్మజారాణి దంపతులు సుమారు రూ.60 వేల విలువైన 4 గ్రాముల బంగారాన్ని అమ్మవారి స్వర్ణవస్త్రం ప్రాజెక్టు కోసం విరాళంగా సమర్పించారు.
భక్తి శ్రద్ధలతో బంగారాన్ని ఆలయ అధికారులకు అందజేసిన దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త పాపోలు ఏడుకొండలు తదితరులు దంపతులను అభినందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.
మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టు కోసం భక్తులు తమవంతు సహకారం అందించడం అభినందనీయమని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. అమ్మవారి స్వర్ణవస్త్రం ప్రాజెక్టు భక్తుల భాగస్వామ్యంతో మరింత వైభవంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

