The Desk …K.Pentapadu : ▪️స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర▪️

The Desk …K.Pentapadu : ▪️స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర▪️

🔴 ప.గోజిల్లా : పెంటపాడు మండలం : కస్పా పెంటపాడు : ది డెస్క్ :

కస్పా పెంటపాడు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.

రహదారులు, వీధులు, బహిరంగ ప్రదేశాలు, కాలువలు, చెరువులను శుభ్రం చేసి చెత్త పేరుకుపోయే ప్రాంతాలను తొలగించారు.

ఇంటింటి చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజా మరుగుదొడ్ల శుభ్రత, పచ్చదనం, పరిసరాల సుందరీకరణకు చర్యలు చేపట్టారు. కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఎంపీటీసీ ఏడుకొండలు, HM రామకృష్ణ, సచివాలయ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది పలువురు పాల్గొన్నారు.