The Desk … Eluru : విజేతలకు ఎంపీ అభినందనలు

The Desk … Eluru : విజేతలకు ఎంపీ అభినందనలు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ న్యూస్ :

ప్రజాసేవలో మన్ననలు పొందాలి

గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగండి

➖ మహేష్ పుట్టా (MP)

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు శనివారం ఏలూరులో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్‌ విజేతలు ఎంపీని పూలమాలలతో సత్కరించారు. కామవరపుకోట మండలం తాడిచర్ల గ్రామ సర్పంచ్‌ విజేతతో పాటు పలువురు మండల నాయకులు కూడా ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా విజేతలకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా విజేతలతో ఎంపీ మాట్లాడుతూ :

ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకోవాలని, సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.