🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :
డిసెంబరు 5, 6 తేదీల్లో 7వ హేలాపురి బాలోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ
నాణేలలో చరిత్ర.. నోట్లలో ప్రత్యేకత
కనువిందు చేయనున్న అరుదైన కరెన్సీ సంపద
ఒకే వేదికపై అపురూప నాణేలు.. అద్భుత నోట్లు
చరిత్రను చాటే నాణేలు – ఆశ్చర్యపరిచే కరెన్సీ నోట్లు
నాణేల ప్రపంచం – పాత నాణేలు.. కొత్త అనుభూతులు
చరిత్రకు అద్దం పట్టే అరుదైన నాణేలు, అపురూపమైన కరెన్సీ నోట్ల ప్రదర్శనకు ఏలూరు వేదిక కానుంది. ఖాన్స్ ఖజానా ఆధ్వర్యంలో ప్రముఖ నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణకర్త అలీఖాన్ మహమ్మద్ నేతృత్వంలో.. 7వ హేలాపురి బాలోత్సవంలో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు.
డిసెంబరు 5, 6 తేదీల్లో (శని, ఆది) అమీనాపేటలోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. అరుదైన నాణేలు, ప్రత్యేక కరెన్సీ నోట్లు, ఫ్యాన్సీ నంబర్ల నోట్లను ఒకే వేదికపై వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.
పిల్లల్లో చరిత్రపై అవగాహన, సేకరణాభిరుచి పెంపొందించడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

