🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ న్యూస్ :
ప్రజా వినతులకు తక్షణ స్పందన
అధికారులకు ఆదేశాలు
ప్రజలకు భరోసా
గత రెండున్నరేళ్లలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. మంగళవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వినతులు స్వీకరించారు.
సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రెండున్నరేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చామని, రానున్న రోజుల్లోనూ మరిన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు.

