The Desk … Eluru : రజకులకు అండగా టీడీపీ.. స్థానిక ఎన్నికల్లో సముచిత ప్రాధాన్యం

The Desk … Eluru : రజకులకు అండగా టీడీపీ.. స్థానిక ఎన్నికల్లో సముచిత ప్రాధాన్యం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

రజకులకు తొలి నుంచి న్యాయం చేస్తూ వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు దువ్వారపు రామారావు అన్నారు. ఏలూరులోని ఉమ్మడి జిల్లా రజక సంఘం భవనం వద్ద నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో రజకులకు అవకాశం కల్పిస్తామని, నామినేటెడ్‌, ఆలయ పదవుల్లోనూ ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రజక సంఘాల నాయకులు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

అమ్మవారికి వెండి కిరీటం సమర్పణ :

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు :

నగరంలోని దక్షిణపు వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దుర్గా మల్లేశ్వర, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారికి వెండి కిరీటాన్ని సమర్పించారు. ఏలూరు ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

కనకదుర్గమ్మకు ఎమ్మెల్యే పూజలు :

నగరంలోని పాత బస్టాండ్‌ సెంటర్‌, మినీ లారీ స్టాండ్‌ సమీపంలోని కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన తొలి పూజా కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి :

నగరంలోని నాలుగో డివిజన్‌ లంబాడీపేటలో వినాయక చవితి సందర్భంగా బాల గణపతి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

టీడీపీ లీగల్‌ సెల్‌ సమావేశానికి ఎమ్మెల్యే :

నగరంలోని అశోక్‌నగర్‌ అంబికా కన్వెన్షన్‌లో నిర్వహించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్‌ సెల్‌ సమావేశానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ న్యాయ విభాగానికి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు.