🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
అభాగ్యులకు అండగా “ఏలూరు శక్తి టీమ్”
అనాథలకు ఆశ్రయం.. అభాగ్యులకు అభయం
ఖాకీ చాటున కరుణ.. అభాగ్యులకు అండ
రక్షణే కాదు.. పునరావాసమూ!
కన్నీటి కథకు ‘శక్తి టీమ్’ ఓదార్పు
సేవలో శక్తి టీమ్.. సాయంలో స్ఫూర్తి
మానసిక స్థితి సరిగా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లకు ఏలూరు మహిళా పోలీసుల “శక్తిటీమ్ అండగా నిలిచింది. ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ ఆదేశాలతో.. మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు, ఎస్‌ఐ నాగమణి ఆధ్వర్యంలో సిబ్బంది వారిని సురక్షితంగా స్థానిక క్రిస్టియన్ ఛారిటీకి తరలించి ఆశ్రయం కల్పించారు. అక్కడ వారికి అవసరమైన వసతులు అందేలా చర్యలు తీసుకున్నారు.
అనాథ పిల్లలకు రక్షణ, విద్యా సదుపాయాలు కల్పించడంతోపాటు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి పునరావాసం, తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలోనూ శక్తి బృందం సేవలందిస్తోంది. ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా నిలుస్తున్న పోలీసుల సేవలను పలువురు అభినందిస్తున్నారు.

