🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
నవంబర్‌లో మూడు ఆర్వోబీల పనులు ప్రారంభించాలి
➖ఎంపీ పుట్టా
ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో నాణ్యతపై రాజీపడేది లేదని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన ఆధునీకరణ పనులు, ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లు, మరుగుదొడ్లు, టికెట్ కౌంటర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించి పార్లమెంట్ పరిధిలో ప్రతిపాదించిన సుమారు 30 ఆర్వోబీల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అనుమతులు వచ్చినా పనులు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్‌సీ-365 సహా మూడు ఆర్వోబీల పనులను నవంబర్, డిసెంబర్‌లో ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రైవేటు భూములు, ఇళ్లకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగేలా ఆర్వోబీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. రైల్వే బ్రిడ్జిల కింద నీరు నిలవడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్న ప్రాంతాలపై కూడా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

