The Desk … Eluru : న్యాయ అవగాహనతోనే చైతన్య సమాజం

The Desk … Eluru : న్యాయ అవగాహనతోనే చైతన్య సమాజం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

ఏలూరులో ఉచిత న్యాయ సలహా కేంద్రం ప్రారంభం

చట్టంపై అవగాహనే.. ప్రజలకు రక్ష

సామాన్యులకు అండగా.. ఉచిత న్యాయ సలహా

ప్రజల చెంతకు న్యాయ సేవలు

ప్రజా సేవలో మరో ముందడుగు

న్యాయ అవగాహనతోనే చైతన్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యలకు ఉచిత సలహాలు, మార్గదర్శకత్వం అందించేందుకు ఏలూరు పవర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు.

కేంద్రంలో ఏడుగురు న్యాయవాదులు ప్రజల సమస్యలను స్వీకరించి తగిన సూచనలు అందించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులు, బాధ్యతలు, చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని బడేటి చంటి సూచించారు. చట్టాలపై అవగాహనతో మోసాలు, అన్యాయాలను గుర్తించి తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజాదర్బార్‌, ఉచిత వైద్య శిబిరాల తరహాలో న్యాయ సలహా కేంద్రాన్ని కూడా ప్రతి వారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్‌ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పి.సాయి రమేష్‌, కార్యదర్శి ఎం.వి.సురేష్‌, న్యాయవాదులు పుచ్చల వెంకట్‌, కె.కన్నబాబు, జేఎంవీవీ ప్రసాద్‌, సిహెచ్‌ఎన్‌ శిరీషాదేవి, ఆర్‌.కిషోర్‌కుమార్‌, టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.