The Desk…Tadepalligudem : ▪️స్వచ్ఛ పదం కార్యక్రమం▪️

The Desk…Tadepalligudem : ▪️స్వచ్ఛ పదం కార్యక్రమం▪️

పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ నిషేధించాలి➖ZP CEO జగదాంబ.

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : పెదతాడేపల్లి : ది డెస్క్ :

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామాల్లో అధికారులు చేసే ప్రతి పనీ ప్రజలకు చేరువ కావాలని జడ్పీ సీఈవో జగదాంబ సూచించారు. పెదతాడేపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని బుధవారం ఆమె పర్యవేక్షించారు.

సందర్భంగా ఆమె మాట్లాడుతూ :

ప్రజలకు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పడం మాత్రమే కాదని.. పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ ను నిషేదించాలని తెలిపారు. స్వచ్ఛత కోసం ప్రభుత్వం స్వచ్ఛరథం ద్వారా చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇంటింటికీ చేరువ కావాలని సూచించారు. సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించి కూరగాయల మొక్కలు, ఆకు కూరలు వేయాలన్నారు. రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీల డివిజినల్ డెవలప్ మెంట్ అధికారి ప్రభాకర్రావు, ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో ఎం. వెంకటేశు, కార్యదర్శులు టి.రవిచంద్ర, రఘునాథరాజు, ఎంఆర్సీ రవికిరణ్, సచివాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.