ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

నందిగామలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎస్సీ సెల్ నేతలు, కూటమి నాయకులతో కలిసి వారి కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
అంబేద్కర్ వ్యక్తి కాదు, మహోన్నత శక్తి అని, అణగారిన వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత అని, అందరికీ సమాన హక్కులు కల్పించి బడుగు, బలహీన వర్గాల తలరాతలు మార్చిన వ్యక్తి అని, కుల వివక్ష, అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు, ఆయన కలలు కన్న సమాజ స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, సమానత్వం, న్యాయం, విద్యా అవకాశాలు అందరికీ చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

