The Desk…Eluru : ‎ఘనంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు

The Desk…Eluru : ‎ఘనంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు

🟡 ఏలూరు జిల్లా : ది డెస్క్ :


‎జిల్లావ్యాప్తంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు.

గ్రామ గ్రామాన హోరెత్తిన అభిమానం.

నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షల వెల్లువ.

ఫ్లెక్సీలు, అన్నదానాలు, కేక్ కటింగ్ లతో అభిమానం చాటుకున్న ఏలూరు పార్లమెంటు ప్రజానీకం.


చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్, భీమడోలులో అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు బడేటి చంటి పలువురు ప్రముఖుల గ్రీటింగ్స్

కైకలూరు వేడుకల్లో మాగంటి బాబు, జయమంగళ వెంకటరమణ.

ఎంపీకి ఫోన్ లో గ్రీటింగ్స్ చెప్పిన నేతలు...

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.  గ్రామగ్రామాల్లో టీడీపీ పార్టీ కార్యకర్తలు, నేతలు, ఎంపీ అభిమానులు శుక్రవారం ఉదయం నుంచే కేక్ కటింగ్ లు, అన్నదానాలు, ప్రత్యేక కార్యక్రమాలతో సందడి చేశారు.

ఉదయం ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో అఖిలాంధ్ర దివ్యాంగుల సంస్థ (ADSS) ఏలూరు జిల్లా అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఎంపీ కి శుభాకాంక్షలు తెలిపారు. భారీగా తరలివచ్చిన దివ్యాంగులు ఎంపీకి శుభాకాంక్షలు చెబుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ఎంపీ చేస్తున్న కృషిని గుర్తుచేశారు.

కైకలూరు తాలూకా సెంటర్ లో టీడీపీ సీనియర్ నేత బీకేఎం నాని ఆధ్వర్యంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ పాల్గొని ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు.

అనంతరం అక్కడినుంచే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మాగంటి బాబు.. మీలాంటి యువకులు రాజకీయాల్లో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెబుతూ ఎంపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. అదేవిధంగా ‎చింతలపూడిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్, భీమడోలులో జరిగిన వేడుకల్లో అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.

‎ఏపీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో  భారీ కేక్ ను కట్ చేసారు. ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్టాండుల వద్ద చలివేంద్రాలు ప్రారంభించిన టీడీపీ నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు.

సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ :

జిల్లాలో గతంలో మరే ఎంపీ చేయని విధంగా అభివృద్ధి పనులు చేస్తున్న పుట్టా మహేష్ కుమార్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో పాటు,  సుదీర్ఘకాలం ఏలూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

పాత బస్టాండ్ వద్ద జీప్ అండ్ టాక్సీ అసోసియేషన్ అధ్యక్షుడు నెరుసు వెంకటసుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం పాల్గొన్నారు.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జన్మదినం సందర్భంగా  ఏలూరు పట్టణంలో RR పేట, పాత బస్టాండు, ఫైర్ స్టేషన్ , కలెక్టరేట్ వద్దగల నాలుగు అన్నా క్యాంటీన్ లలో శుక్రవారం మధ్యాహ్నం పార్టీ నేతలు ప్రజలకు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్ కి భోజనానికి వచ్చినవారికి ఉచిత భోజన టోకెన్లు అందించారు.

వీటితోపాటు కోటదిబ్బ “విభిన్న ప్రతిభావంతుల పాఠశాల”లో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు ముమ్మడి చింతయ్య, టీడీపీ సీనియర్ నాయకులు నందిగం బాబి, మన్నె అశోక్ గజపతిరాజు, జనసేన నాయకుడు దిశ కమిటీ నెంబర్ షేక్ కరీముల్లా, 36 వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమ సురేష్ ఇతర నేతలు పాల్గొన్నారు.

‎టి నర్సాపురం మండలంలో శీలం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో, నూజివీడులో యనమదల నాని ఆధ్వర్యంలో, పోలవరంలో పరిమి రాంబాబు ఆధ్వర్యంలో, కొయ్యలగూడెంలో పారేపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఎంపీ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఏలూరు పార్లమెంటులోని అన్ని మండలాలు, గ్రామాలలో పార్టీ అభిమానులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జన్మదిన వేడుకలను గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మరింత ఘనంగా, కోలాహలంగా నిర్వహించడం విశేషం కావడం గమనార్హం.