The Desk … Amaravati : అమరావతి రైతులకు సంఘీభావంగా డాక్టర్ మనోజ్…వైష్ణవి సంకల్పానికి సహకరించండి➖డాక్టర్ మనోజ్

The Desk … Amaravati : అమరావతి రైతులకు సంఘీభావంగా డాక్టర్ మనోజ్…వైష్ణవి సంకల్పానికి సహకరించండి➖డాక్టర్ మనోజ్

🔴 అమరావతి : విజయవాడ : ది డెస్క్ :

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు గాను.. రాజధాని రైతులు మొక్కు తీర్చుకోవడం కోసం ఇంద్రకీలాద్రికి చేరుకున్న తరుణంలో… వారికి సంఘీభావంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ ఇంద్రకీలాద్రి కి చేరుకున్నారు.

సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ :

రాజధాని రైతులకు సంఘీభావంగా ఇక్కడికి రావడం జరిగిందని, తన కుమార్తె కళాశాలలో విద్యనభ్యసిస్తున్న కారణంగా రాలేకపోయారని, అంబుల వైష్ణవి సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో.. మన రాజధాని మనమే నిర్మించుకుందాం అనే నినాదంతో ప్రతి ఒక్కరు 116/- రూపాయలు సి ఆర్ డి ఎ ఎకౌంటుకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుతూ.. ప్రతి ఒక్కరూ అమరావతి నిర్మాణంలో పాలిభాగస్తులవ్వాలని, ఇక్కడికి చేరుకున్న రైతులకు పాద పూజ చేసి సత్కరిస్తానని తెలిపారు.