The Desk … Amaravati : హ్యాపీ గుడ్ ఫ్రైడే➖మంత్రి ఆనం

The Desk … Amaravati : హ్యాపీ గుడ్ ఫ్రైడే➖మంత్రి ఆనం

🔴 అమరావతి : ది డెస్క్ :

గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్రంలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు మనుషుల పాప విమోచన కోసం తనను తాను త్యాగం చేసిన పవిత్ర దినమని తెలిపారు. ప్రేమ, క్షమ, త్యాగం అనే మహోన్నత సందేశాలను యేసుక్రీస్తు ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు.

ప్రపంచంలో శాంతి, సౌహార్దం నెలకొనాలని, ప్రతి మనిషి పరస్పరం ప్రేమతో, సహనంతో జీవించాలని ఈ పర్వదినం మనకు సూచిస్తుందని మంత్రి అన్నారు. యేసుక్రీస్తు బోధనలు సమాజంలో నైతిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శాంతి, ఆనందం కలగాలని, రాష్ట్రం సుఖసంతోషాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు.