🟡 అమరావతి : వెంకటాపాలెం : ది డెస్క్ :
అమరావతికి జీవం పోద్దాం – 116/- రూపాయలు సాయం చేద్దాం.. కార్యక్రమంలో భాగంగా.. రాజధానికి భూములిచ్చిన రైతులకు అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ చేస్తూ.. అమరావతిని మనమే నిర్మించుకుందాం అంటూ.. చేపట్టిన సంకల్పంలో భాగంగా ఇప్పటికే రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాలలో ఐదు గ్రామాల్లో రైతులకు పాదపూజ చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగిలిన గ్రామాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని.. నా కుమార్తె అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి కళాశాల విద్య కారణంగా రాలేకపోయారని.. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నా భుజస్కాoదాలపై వేసుకుని నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరుస్తున్న మద్దతు కొరకై.. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డాక్టర్ మనోజ్ అనే నేను మరియు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి నా కుమార్తె మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా అమరావతి నిర్మాణంలో పాలిభాగస్తులగుటకై 116/- రూపాయలు అతి చిన్న అమౌంటు సిఆర్డిఏ అకౌంట్ కు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు.. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడను.

