The Desk… Kaikaluru : విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం – సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం ప్రకటింపు

The Desk… Kaikaluru : విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం – సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం ప్రకటింపు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షుడు తుపాకుల సోమాచారి అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా మండల వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, బీఎంఎస్ రాష్ట్ర నాయకుడు యానాల బసవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సంఘం రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిందని అభినందించారు. వితంతువులు, వృద్ధులకు అందిస్తున్న పింఛన్‌కు తోడుగా ప్రతినెల అదనంగా ఒక్కొక్కరికి రూ.100 చొప్పున సుమారు రూ.3,500 తన వంతుగా అందజేస్తామని ప్రకటించారు.

బసవయ్య మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో విశ్వబ్రాహ్మణ సంఘం ముందంజలో ఉందని పేర్కొన్నారు. రామకృష్ణ సంఘ సేవా కార్యక్రమాలకు చేయూతనందించడం అభినందనీయమన్నారు.

అధ్యక్షుడు సోమాచారి మాట్లాడుతూ రామకృష్ణకు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, నాలుగు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.