The Desk… Bhimavaram : కూటమి ప్రభుత్వం పేదల గృహ స్వప్నం నెరవేర్చుతోంది – తోట సీతారామలక్ష్మి

The Desk… Bhimavaram : కూటమి ప్రభుత్వం పేదల గృహ స్వప్నం నెరవేర్చుతోంది – తోట సీతారామలక్ష్మి

ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో సుమారు 2000 కుటుంబాలకు ఎన్టీఆర్ టిడ్కో గృహాల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల గృహ స్వప్నాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అంజిబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లలో ప్రవేశించి ఆనందం వ్యక్తం చేశారు.