The Desk… Eluru : జిల్లాలో రికార్డు స్థాయిలో 1.40వేలు మొక్కలు నాటిన యంత్రాంగం

The Desk… Eluru : జిల్లాలో రికార్డు స్థాయిలో 1.40వేలు మొక్కలు నాటిన యంత్రాంగం

ఏలూరు జిల్లా : ఏలూరు : The Desk… Eluru : జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో శుక్రవారం నాడు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 1.40వేలు మొక్కలు నాటడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. భూమిపై ఉన్న వనరులలో అత్యంత ముఖ్యమైన వనర్లు చెట్లు అన్నారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి మానవాళికి అవసరమైన ఆక్సిజన్ ను అందిస్తాయన్నారు. మొక్కలు నాటడం, చెట్లను పరిరక్షించుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ఆయన అన్నారు.