ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ :
ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రెవెన్యూ అంశాలు, కొత్త పెన్షన్లకు సంబంధించిన పలు అభ్యర్థనలు అధికారులకు అందజేశారు.
ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసి, ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మండల రెవెన్యూ అధికారి, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

